స్పోర్ట్స్ హబ్‌గా హనుమకొండ
వరంగల్ స్పోర్ట్స్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నిలయమైన హనుమకొండ జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజులు నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఫలితాలను స్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్లు పాల్గొనగా, 32 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకోగా, మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్ రెడ్డి, గట్టు మహేశ్‌బాబు, మహ్మద్ కరీం, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
ముగిసిన సీఎం కప్ పోటీలు


