సంగీతమంటే ఇష్టం | - | Sakshi
Sakshi News home page

సంగీతమంటే ఇష్టం

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

సంగీతమంటే ఇష్టం

సంగీతమంటే ఇష్టం

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ కల్చరల్‌: సంగీతమంటే తనకు ఇష్టమని, సివిల్స్‌కు సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయొలిన్‌ నేర్చుకున్నానని, మళ్లీ సాధన చేస్తున్నానని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. గురువారం వరంగల్‌లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సద్గురు త్యాగరాజస్వామి 179వ ఆరాధనోత్సవాలు, పండిట్‌ విష్ణు నారాయణ్‌ భాత్ఖండే, పండిట్‌ విష్ణు దిగంబర్‌ పలుస్కర్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ నౌడ్గడ సుధీర్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ముఖ్యఅతిథిగా హాజరై సంగీతోత్సవాన్ని ప్రారంభించారు. వయొలిన్‌ అధ్యాపకుడు టి. చిన్నకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి బ్రహ్మమురారి.., అయిగిరి నందిని.. వంటి భక్తిపాటలను వయొలిన్‌పై వాయించి ప్రేక్షకులను అబ్బురపర్చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వరంగల్‌లో ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ఉండడం, ఎంతోమంది విద్యార్థులు ఈ కళల్లో శిక్షణ పొందడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కర్ణాటక గాత్ర విద్వాంసుడు వాస గోపినాఽథ్‌, అధ్యాపకులు యోష, సత్యనారాయణ, ఏడిద భీమ్‌శంకర్‌, వాజీద్‌హుస్సేన్‌, విశ్రాంతాచార్యుడు గుమ్మడి జనార్ధన్‌, సిబ్బంది శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement