జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

జేఈఈల

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం

హన్మకొండ: జేఈఈ మెయిన్స్‌–2026 ఫలితాల్లో షైన్‌ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తమ కళాశాల విద్యార్థులు 95.23, 95.22 పర్సంటైల్‌ సాధించి కార్పొరేట్‌ విద్యాసంస్థలకు సమాన ఫలితాలు సాధించారని షైన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ మూగల కుమార్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులను చైర్మన్‌ మూగల కుమార్‌, డైరెక్టర్లు మూగుల రమ, అరూరి కవిత, మూగుల రమేశ్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్‌–2026లో తమ కళాశాల జాతీయ స్థాయి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌, నీట్‌లో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకడమిక్‌ ప్రోగ్రామింగ్‌, ప్రణాళికల ద్వారా ఆణిముత్యాలుగా తీర్చిదిద్దడం ద్వారా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎం.ప్రశాంతి 95.23 పర్సంటైల్‌, ఎం.దీక్షిత 95.22, రూప శ్రీలక్ష్మి 94.51, ఆర్‌.సౌరభ్‌ వర్మ 94.23, కె.అభిలాశ్‌ 92.38, వి.మాధురి 92.11, జి.సిద్దు 92.09 పర్సంటైల్‌ సాధించారని వివరించారు. వీరితో పాటు 28 మంది విద్యార్థులు 85కు పైగా పర్సంటైల్‌ సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అత్యుత్తమ బోధన, నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్‌తో మామూలు విద్యార్థులను కూడా మెరికల్లా తీర్చిదిద్ది నట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతోనే ఈ విజయాలు సాధించారన్నారు. కార్యక్రమంలో షైన్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌, ఐఐటీ కో–ఆర్డినేటర్‌ మూగుల రమేశ్‌ యాదవ్‌, కళాశాలల ప్రిన్సిపల్స్‌ మారబోయిన రాజు గౌడ్‌, శ్రీనివాస్‌, ప్రశాంత్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆర్‌.సౌరబ్‌ వర్మ

రూప శ్రీలక్ష్మి

ఎం.దీక్షిత

ఎం.ప్రశాంతి

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం1
1/3

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం2
2/3

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం3
3/3

జేఈఈలో ‘షైన్‌’ ప్రభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement