గూడూరు: మండలంలోని రాములుతండాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనావత్ రాధాబాయిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించినట్లు సోమవారం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్‌తో పాటు పలువురికి రాధాబాయి కృతజ్ఞతలు తెలిపారు.


