సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలతో స్థిరమైన ఆదాయం | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలతో స్థిరమైన ఆదాయం

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలతో స్థిరమైన ఆదాయం

గూడూరు: ప్రతీ ఒక్కరు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పథకాలను వినియోగించుకోవాలని టీజీ రెడ్కో జిల్లా మేనేజర్‌ గంధం రాజేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్‌ వాంకుడోతు సునీతకొమ్మాలునాయక్‌ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపైన సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుని సౌరశక్తిని విద్యుత్‌ శక్తిగా ఉత్పత్తి చేసుకొని లబ్ధిపొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్‌ యోజన పథకం కింద ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలో వాట్స్‌కు రూ.60వేలు, 3 కిలో వాట్లకు రూ.70వేల వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. అలాగే రైతులు పీఎం కుసుమ్‌ పథకంలో వ్యవసాయ భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకంలో రైతులు సంవత్సరానికి సుమారు రూ.50 నుంచి రూ.52 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఈసందర్భంగా అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement