సమ్మర్ క్యాంపుల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
యోగాసనాలు వేస్తున్న విద్యార్థినులు
డ్యాన్స్ నేర్చుకుంటున్న విద్యార్థినులు
నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. టీవీలో పాటలు చూస్తూ నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ప్రస్తుతం నృత్యంలో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలతో పాటు శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అభినందనలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేసవి సెలవుల్లోనూ సిమ్మింగ్‌తోపాటు డ్యాన్స్ శిక్షణ తరగతులకు హాజరవుతున్నా. –కాజీపేట
బి.రియాన్షా , 4వ తరగతి, కాజీపేట
మహబూబాబాద్ అర్బన్: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఆటాపాటలతో సందడి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన శిక్షణ(సమ్మర్ క్యాంపు) తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొని తమకు నచ్చిన క్రీడ, ఆటాపాటలు నేర్చుకుంటూ సరదాగా గడిపారు. పిల్లల్లో మానసికోల్లాసం, ఆటాపాటల్లో నైపుణ్యం పెంచడానికి గత నెల 25వ తేదీ నుంచి మొదలైన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు హుషారుగా వచ్చి తర్ఫీదు పొందారు. డ్యాన్స్, కుట్లు, అల్లికలు, స్పోకెన్ ఇంగ్లిష్, వాలీబాల్, యోగా.. ఇలా 10 రకాల క్రీడాంశాలపై ఇచ్చిన శిక్షణలో సుమారు 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు
సమ్మర్ క్యాంపులు ఇలా.
ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, ములుగు జిల్లా చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల, కొత్తగూడ సోర్ట్స్ స్కూల్‌లో వేసవి శిబిరాలు నిర్వహించారు. చిన్నబోయినపల్లి, మహబూబాబాద్‌లో క్యాంపునకు 100 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ బేసిక్స్, ఆర్ట్, క్రాఫ్ట్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మోహిందీ మేకింగ్, డిజైనింగ్ ఆన్ హ్యాండ్స్, అక్షరాస్యత, వ్యాసచరన, వ క్తృత్వం, కథ, రచన, కథలు చెప్పడం, పద్యాలు పాడడం, తెలుగు, ఇంగ్లిష్ స్పెల్–బీ, నృత్యం, పాటలు, సాంస్కృతి కార్యకలాపాలు, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించారు.
మోడల్ క్రీడా పాఠశాలలో..
కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో 60 మంది బాలికలు, 60 మంది బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, జావెలిన్‌త్రో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో శిక్షణ నిర్వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు పలు అంశాల్లో మెళకువలు నేర్పించారు.
ఆడుతూ.. పాడుతూ
వేసవి సెలవుల్లో మండలంలోని పలు ప్రాంతాల్లోని చిన్నారులు బొమ్మల ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. విజ్ఞానంతోపాటు మానసికోల్లాసానికి సంబంధించిన ఆటలు ఆడుతున్నారు. టెడ్డీ బియర్లు, గురుగులతో ఆడుతూ రోజంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. – ఏటూరునాగారం
బొమ్మలతో ఆడుకుంటున్న చిన్నారులు
చెట్టు నీడలో ఆటాపాట
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో కరాటే అకాడమీ నిర్వాహకులు అబ్బు, హుస్సేన్ బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా కరాటే నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని మాస్టర్లు తెలిపారు. ఈ శిక్షణ నెల రోజుల పాటు కొనసాగుతుందని, కరాటేతో బాలికల్లో ఆత్మరక్షణ కలుగుతుందన్నారు. – ఏటూరునాగారం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు చోట్ల సమ్మర్ క్యాంపులు నిర్వహించాం. ఈ శిబిరాలతో విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక దృఢత్వం పెంపొందుతుంది. పిల్లలు క్రమ శిక్షణ తో అన్ని అంశాలు నేర్చుకున్నారు.
–దేశీరాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ
సంచాలకుడు, మానుకోట జిల్లా
వేసవి సెలవుల్లో ఆడుతూ పాడు తూ గడపడం సంతోషంగా ఉంది. తెలుగులో లఘులు, గురులు, ఇంగ్లిష్‌లో గ్రామర్, యోగాలో సూర్య నమస్కారాలు, ఆసనాలు నేర్చుకున్నాం. ఈ శిబిరం నాకు నచ్చింది.
– యామిని,
బాలికల ఆశ్రమ పాఠశాల ఊరట్టం, మేడారం
నేను ఇంగ్లిష్ మాట్లాడానికి ఈ స్పోకెన్ తరగతులు చాలా ఉపయోగపడుతున్నాయి. సహ విద్యార్థుల మధ్య స్పీకింగ్ భయం పోగొట్టడం, ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ సులువుగా ఉంది.
– అక్షయ, బాలికల ఆశ్రమ పాఠశాల ప్రాజెక్ట్ నగర్,
ములుగు జిల్లా
ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ హుస్సేన్
వేసవి సెలవుల్లో ఇరుగుపొరుగు విద్యార్థులు ఒక చోట చేరి సందడి చేస్తున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు ఇంట్లో ఉండకుండా చల్లదనం కోసం చెట్ల కిందికి చేరుతున్నారు. అక్కడ తమకు తోచిన ఆటలు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. – వాజేడు
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు శిబిరాలు


