దేవుళ్లను విమర్శిస్తే భూస్థాపితమే.. | - | Sakshi
Sakshi News home page

దేవుళ్లను విమర్శిస్తే భూస్థాపితమే..

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి

ఖానాపురం : హిందూ దేవుళ్లను విమర్శిస్తే ఎవరైనా భూస్థాపితం కావాల్సిందేనని, హిందూ దేవుళ్లను విమర్శించిన మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, స్టాలిన్‌, మమతాబెనర్జీలు భూస్థాపితమయ్యారని బీజేపీ శాసనసభ పక్షనేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో కూల్చివేసిన శివాలయాన్ని శుక్రవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వచ్చిన నాటినుంచి 13 దేవాలయాలను కూల్చివేశారని పేర్కొన్నారు. చరిత్రను కాపాడుకోవడానికి ఇతర రాష్ట్రాలు నిధులు కేటాయిస్తే, తెలంగాణలో కూల్చడానికి నిధులు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులకు భూములపై ఉన్న పిచ్చితో దేవాలయ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. శివాలయం పునఃనిర్మాణం చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో చందాలు వేసుకోని నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మాగ్రహ దీక్షకు మద్దతు తెలిపి రాణాప్రతాప్‌రెడ్డి, నాయకులతో దీక్షను విరమింపజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, వడ్డేపల్లి నర్సింహారాములు, రాధారపు అశోక్‌, సందీప్‌, వినయ్‌, అంబేడ్కర్‌, అశోక్‌, రాజశేఖర్‌, సహదేవ్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మూర్ఖుల పాలన

తెలంగాణలో మూర్ఖుల పాలన సాగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అశోక్‌నగర్‌లో 800 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణమన్నారు.

‘ఎక్స్‌’లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement