కళతప్పిన గ్రంథాలయాలు | - | Sakshi
Sakshi News home page

కళతప్పిన గ్రంథాలయాలు

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

మహబూబాబాద్‌: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోస్టును రెండున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు భర్తీ చేశా రు. అయితే ఆయనకు గ్రంథాలయాల్లో పేరుకుపోయిన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా గ్రంథాలయంలో మినహా మిగిలిన 13 గ్రంథాలయాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. స్వీపర్లే వాటి నిర్వహణ చేపడుతున్నారు. ఇన్నాళ్లు చైర్మన్‌ లేకపోవడంతో మున్సిపాలిటీలు, జీపీల నుంచి వచ్చే కోట్ల రూపాయల పన్ను చెల్లించడంలో అఽధికారులు నిర్లక్ష్యం చేశారు. కాగా, ఆ పన్ను గ్రంథాలయాలకు చెల్లిస్తే అభివృద్ధికి అడుగులు పడుతాయి.

రెండు మినహా అన్ని ఖాళీలే..

జిల్లా గ్రంథాలయానికి కార్యదర్శి లేకపోవడంతో వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి ఇన్‌చార్జ్‌ ఇచ్చారు. డిప్యూటీ లైబ్రేరియన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూని యర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌, వాచ్‌మెన్‌, తోటమాలి ఉండాలి. కానీ ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇద్దరు లైబ్రేరియన్లు ఉండగా.. వారు వారానికి రెండు మూడు రోజులే వస్తున్నారు. సిబ్బంది లేక సమస్యలు వస్తున్నాయి.

13 శాఖ, గ్రామ గ్రంథాలయాలు..

జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు, కొత్తగూడ, ఇనుగుర్తి, డోర్నకల్‌, గార్లలో శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. కురవి మండల కేంద్రం, అదే మండలంలోని రాజోలులో గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు, పక్కా భవనాలు లేకపోవడంతో పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

స్వీపర్లే దిక్కు..

గ్రంథాలయాల్లో లైబ్రేరియన్‌, అటెండర్‌ ఉండాలి. కానీ 13 గ్రంథాలయాల్లో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో స్వీపర్లే దిక్కు అయ్యారు. దీంతో నిర్వహణ సరిగా లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు.

పన్ను పెండింగ్‌లోనే..

గ్రంథాలయాల అభివృద్ధికి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఆస్తి పన్నులో 8 శాతం చెల్లించాలి. ప్రజలు పన్ను చెల్లిస్తున్నారు. ఈ మేరకు 8శాతం పన్ను జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలో జమ చేయాలి. అయితే సుమారు రూ.2.5కోట్ల సెస్‌ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో గ్రంథాయాల అభివృద్ధి కుంటుపడింది. చైర్మన్‌ లేక పోవడం, ఇన్‌చార్జ్‌ కార్యదర్శి వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎట్టకేలకు చైర్మన్‌ నియామకం..

2023 డిసెంబర్‌ 5న అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపూడి నవీన్‌రావు రాజీనామా చేశారు. కాగా రెండున్నర సంవత్సరాలుగా ఆ పోస్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఎట్టకేలకు ఈనెల 5న రాత్రి ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవ సేన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితియే.

సమస్యల స్వాగతం..

14 గ్రంథాలయాల్లో రెండు పోస్టులు మినహా మిగిలిన అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. చైర్మన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోస్టులు భర్తీ చేస్తేనే గ్రంథాలయాలు గాడిన పడుతాయి. పెండింగ్‌ పన్ను బకాయిలు వసూళ్లు చేయాల్సి ఉంది. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలు, సొంతభవనాలు లేని గ్రంథాలయాలకు పక్కా భవనాల కోసం నిధులు మంజూరు చేయించాలి.

13 లైబ్రరీలకు స్వీపర్లే దిక్కు

పోస్టులన్నీ ఖాళీలు, సౌకర్యాలు నిల్‌

కోట్ల రూపాయల సెస్‌ బకాయిలు

నేడు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

నేడు ప్రమాణ స్వీకారం..

ఈనెల 13న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మానుకోట జిల్లా గ్రంథా లయం ఎదుట సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కా ర్యక్రమానికి మంత్రి ధనసరి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ హాజ రుకానున్నట్లు చైర్మన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement