రైతు సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ధ్యేయం

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు

జాటోతు హుస్సేన్‌నాయక్‌

రైతులకు స్ప్రే యంత్రాల పంపిణీ

గూడూరు: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ అన్నారు. గూడూరులోని ప్రభుత్వ హైస్కూల్‌లో శుక్రవారం యూనియ న్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఉచితంగా అందించిన 400 స్ప్రే పంపులను రైతులకు కలెక్టర్‌ స్నేహశబరీష్‌తో కలిసి హుస్సేన్‌నాయక్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల మచ్చర్లలో జన్మించిన తనకు ప్రధాని మోదీ ఢిల్లీలో స్థానం కల్పించి రైతులకు సేవచేసే అవకాశం ఇచ్చారన్నా రు. రైతులకు ఏదైనా సేవలందించాలన్న తపనతో, గుర్తుంచుకునేలా వ్యవసాయరంగానికి ఉపయోగపడే స్ప్రే పంపులను అందించాలని యూనియన్‌ బ్యాంకు వారిని కోరినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలుచేస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి విధానంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. అంతర పంటలుగా పామాయిల్‌, కూరగాయలు, వాణిజ్య పంటలు, మిల్టెట్స్‌ పంటల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంపై వివరించారు. అధికంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలను, నానో ఎరువుల వాడకంపై అవగాహన పెంచాలని డీఏఓకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వాంకుడోతు సునీతకొమ్మాలు, యూని యన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రవీంద్రబాబు, కమలాకర్‌, రమేష్‌, విజయ్‌కుమార్‌, గూ డూరు యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ రవికుమార్‌, డీఏఓ సరిత, తహసీల్దార్‌ నాగభవాని, ఏఓ అబ్దుల్‌మాలిక్‌, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

మక్కల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి

ఇనుగుర్తి: మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ అధికారులకు సూచించారు. ఇనుగుర్తి మండలం చిన్య తండా సమీపంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్నలు, కొనుగోలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఎదురుచూస్తున్న రైతులో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూకాల్లో ఆలస్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకేండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో ఫోన్‌లో మాట్లాడి నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు దుంపల సందీప్‌, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, నవీన్‌, సుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement