రైతన్నా.. రంగు తెలుసుకో! | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. రంగు తెలుసుకో!

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

ఖిలా వరంగల్‌: పంటల్లో చీడపీడల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులు వినియోగిస్తుంటారు. మందు డబ్బాలపై పలు రంగుల స్టిక్కర్ల గుర్తులు ఉంటాయి. మందు ఎంత విషపూరితమో ఆ రంగులు సూచిస్తాయి. చాలామంది వీటిని గమనించకుండా పిచికారీ చేసి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికై నా రైతులు మందు డబ్బాలపై ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పుసుపు రంగులను చూసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ఎరుపు (అత్యంత ప్రమాదకరం)

డబ్బా లేదా కవర్‌పై ఎరుపు రంగు, దానిపై ఎముకలు, పుర్రె గుర్తులు ఉంటే అత్యంత విష పూరితమైన ముందుగా పరిగణిస్తారు. ఇది శరీరంలోకి ఏ విధంగా వెళ్లినా ప్రాణాపాయం తప్పదు.

నీలం (మధ్యస్థ ప్రమాదం)

ఈ రకమైన మందులు మధ్యస్థ విషపూరిత స్థాయిని సూచిస్తాయి. డబ్బాలపై డేంజర్‌ అని రాసి ఉంటుంది. వీటిని పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.

ఆకుపచ్చ (తక్కువ ప్రమాదకరం)

వీటి విష తీవ్రత పైన పేర్కొన్న మూడింటి కంటే తక్కువ ఉంటుంది. ప్రమాదకరం (హెచ్చరిక) అని రాసి ఉంటుంది. తక్కువ ప్రమాదకరమైనా సురక్షితమైన పద్ధతిలోనే ఈ మందులను వినియోగించాలి.

పసుపు (ఎక్కువ విషపూరితం)

ఈ పసుపు రంగు మందు కూడా ఎక్కువ విషపూరితమైనదే. వీటిపై పాయిజన్‌ అని రాసి ఉంటుంది. పీల్చినా, చర్మంపై పడినా తీవ్రమైన అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది.

విష తీవ్రతను ఇలా గుర్తించండి

డబ్బా కలర్‌ బట్టి మందు తీవ్రత

పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి

వైద్యులు, వ్యవసాయాధికారుల సూచన

Advertisement
 
Advertisement
Advertisement