● ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో ప్రజల ప్రస్తావన
● పరిష్కారానికి కదిలిన యంత్రాంగం
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ యంత్రాంగం కదిలింది. తాగునీటి సమస్యలపై శనివారం సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్‌చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్‌తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించడంతో ఇందిరానగర్‌లో బోరుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. శాంతినగర్‌లో ట్యాంకర్‌తో నీటి సరఫరా చేశారు. తమ దృష్టికి వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చైర్‌పర్సన్ రాజకుమారిహరినాథ్, వైస్‌చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్ ఈసందర్భంగా తెలిపారు.


