ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులకు ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులకు ఇబ్బంది

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

మాజీ మంత్రి రెడ్యానాయక్‌

దంతాలపల్లి: ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి రెడ్యానాయక్‌ విమర్శించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలి నుంచి ఖమ్మం, వరంగల్‌, జాతీయరహదా రిపై కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సమీపంలోని ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్ధత, ముందుచూపు లేకపోవడం వలనే ధాన్యం, మొక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెల రోజులు గడుస్తున్నా.. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమ న్నారు. నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ధాన్యం బస్తాలు ఉన్నాయన్నారు. తహసీల్దార్‌ సునిల్‌కుమార్‌, పీఏసీఎస్‌ సీఈఓతో మాట్లాడారు. వారం రోజుల్లో ధాన్యం తరలించకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు ధర్మారపు వేణు, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ నూకల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లారెడ్డి, నాయకులు కిషోర్‌, నూకల గౌతమ్‌రెడ్డి, సురేష్‌, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement