డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం చేతిపంపులకు సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన ‘సాక్షి ఫోన్ ఇన్ ’కార్యక్రమంలో భాగంగా చెడిపోయిన చేతిపంపులకు మరమ్మతు చేయించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రాజకుమారికి స్థానికులు మొర పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఆమె చేతి పంపులకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బ్రాహ్మణకుంట, శాంతినగర్, పాతడోర్నకల్, బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లోని చేతిపంపులకు మరమ్మతులు చేయడంతో పాటు బోర్లలో ఫ్లషింగ్ పనులు నిర్వహించారు.
19న ఎకై ్సజ్ వాహనాల వేలం
మహబూబాబాద్ రూరల్: గుడుంబా, బెల్లం సరఫరా చేస్తూ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 19న ఉదయం 11గంటలకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని ఎకై ్సజ్ సీఐ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, జిల్లా అధికారి కిరణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వాహనాల వేలంపాటలో పాల్గొనే వారు పూర్తి వివరాల కోసం మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వాహన ధరలో 50 శాతం డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వేలంపాటలో ఏర్పాటు చేసిన వాహనాల వివరాలు మహబూబాబాద్ స్టేషన్ ఆవరణలో నోటీసు బోర్డుపై ఉన్నాయని తెలిపారు.
అత్యవసర
సేవలందించడమే లక్ష్యం
గూడూరు: ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 108, 102 వాహనాలు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయని ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ బత్తిని మహేష్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం 108, 102 వాహనాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న పలు రికార్డులను, వారు అందించిన ఉచిత సేవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏ సమయంలోనైనా ప్రజల నుంచి ఫోన్ రాగానే సేవలందించడానికి సిద్ధంగా వెళ్లాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఈఎంటీలు హన్మంతు, సుప్రియ, పైలెట్లు అనిల్, ప్రశాంత్, షేక్ మహబూబ్‌పాషా పాల్గొన్నారు.
నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మహబూబబాబాద్ అర్బన్: నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఏస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఏఐఏస్‌ఎఫ్ జిల్లా నాయకులు నీట్ విడుదల చేసిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెలుగు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. 2026–నీట్ పేపర్ లీకేజీ అంత్యత దారుణమని, 23 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. పరీక్షలను సరిగా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సీలువేరు వికాస్, వరుణ్‌కుమార్, కల్యాణ్, నవీన్, హర్షవర్ధన్‌రెడ్డి, సాయి, విశాల్, హాసన్, దీపిక, కీర్తి, దివ్య తదితరులు పాల్గొన్నారు.


