తారు పోసేదెన్నడు? | - | Sakshi
Sakshi News home page

తారు పోసేదెన్నడు?

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

కాంట్రాక్టర్‌కు సూచించాం..

బయ్యారం: రహదారి నిర్మాణం ప్రారంభించి రెండు సంవత్సరాల ఏడు నెలలు పూర్తయిన రోడ్డు తారుకు మాత్రం నోచుకోవటం లేదు. కంకరపోసి అసంపూర్తిగా వదిలేసిన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. అసలు రహదారి పనులు ఎప్పుడు పూర్తి అవుతాయోనని పలు పంచాయతీల వాసులు ఎదురుచూస్తున్నారు.

2023లో శంకుస్థాపన..

మండలకేంద్రం నుంచి మహబూబాబాద్‌ మండలం ముత్యాలమ్మగూడెం వరకు యస్‌టీయస్‌డీఎఫ్‌ నిధులతో రహదారిని నిర్మించేందుకు అప్పటి మంత్రి సత్యవతిరాథోడ్‌ శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బయ్యారం చివరి నుంచి చోక్లాతండా వరకు ఉన్న బీటీ రోడ్డును రెండు వరుసల రహదారి కోసం తొలగించి కంకరపోశారు. కంకరపోసి సంవత్సరన్నర గడిచినప్పటికీ తారును మాత్రం పోయలేదు. మరో వైపు ముత్యాలమ్మగూడెం నుంచి ఉప్పలపాడు పంచాయతీలోని వట్టేరు వరకు రహదారి నిర్మాణం పూర్తి అయినప్పటికీ పూర్తిస్థాయిలో పనులు జరగకపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడ లేదు.

ఏడు పంచాయతీలకు ఇదే రహదారి..

మండలంలోని ఏడు పంచాయతీలు వెంకట్రాంపురం, బాల్యాతండా, బాలాజీపేట, గౌరారం, గురిమెళ్ల, ఉప్పలపాడు, నర్సాతండా గ్రామపంచాయతీల పరిధిలోని పలు గ్రామాల వాసులు పలు పనుల నిమిత్తం నిత్యం మండల కేంద్రానికి వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటారు. రహదారి సరిగా లేకపోవటంతో అవస్థలు పడుతున్నామని ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెల్లిన ఫలితం లేకుండా పోతుందని వాహనదారులు వాపోతున్నారు.

రోడ్డు పనులు ప్రారంభమై రెండున్నరేళ్లు

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

బయ్యారం చివరి నుంచి చోక్లాతండా వరకు కంకర పనులు పూర్తయ్యాయి. తారు పోస్తే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. తారుపోయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. త్వరలోనే పనులు పూర్తి చేసి, వాహనదారుల ఇబ్బందులు తొలగిస్తాం.

– అనిల్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ

Advertisement
 
Advertisement
Advertisement