● సీతానగరం వాసి మృతి
● మృతుడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
గూడూరు: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్ మృతి చెందాడు. ఇరవై ఏళ్లుగా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఇటీవల హెడ్‌కానిస్టేబుల్ (అవాల్‌ధార్)గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో శ్రీనగర్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను సోమవారం రాత్రి బైక్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ విషయాన్ని సీఆర్‌పీఎఫ్ బలగాలు తమకు తెలిపాయని మృతుడి కుటుంబీకులు మంగళవారం తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య సౌజన్య, కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, శ్రీనివాస్‌గౌడ్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు సమాచారం.
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
కన్నాయిగూడెం: మావోయిస్టు ఉద్యమంలో ప్రాణా లర్పించిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మావోయిస్టు బడే చొక్కారావు అలియాస్ దా మోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని బుట్టాయిగూడేకి విచ్చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంతకాలం అడవిలో ఉండి ప్రజల కోసం పనిచేసిన తాను ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తనకు పరిచయం ఉన్న కుటుంబా లు, అమరుల కుటుంబాలను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు.


