● ప్రజావాణిలో కలెక్టర్ స్నేహశబరీష్
● దివ్యాంగుల ఇబ్బందులు
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా వినతులను స్వీకరించి మట్లాడారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేశ్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో 133 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లాస్థాయి అఽధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగుల గోస..
దివ్యాంగులు పలుమార్లు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ వారం ఆటో మాట్లాడుకొని ప్రజావాణికి వస్తున్నారు. ఆటో చార్జీలు వృథా అవుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


