సాంస్కృతిక సంబురాలు.. | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక సంబురాలు..

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

హన్మకొండ చౌరస్తా : ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని జిల్లా బాలభవన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలభవన్‌ సూపరింటెండెంట్‌ డి. ఝాన్సీ , మృదంగం ఇన్‌స్ట్రక్టర్ల నేతృత్వంలో పిల్లలకు కళలు, చేతపనులు, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు గీసిన చిత్రలేఖనం, గణపతి ప్రార్థన, కోలాటం, బృంద నృత్యం, మృదంగ వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యా వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఝాన్సీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement