మహాభారతం, రామాయణం వింటున్న.. | - | Sakshi
Sakshi News home page

మహాభారతం, రామాయణం వింటున్న..

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

నా పేరు కూర హర్షిత్‌. నేను వేసవి సెలవుల్లో హైదరాబాద్‌ నుంచి జనగామలోని మా అమ్మమ్మ, తాతయ్య తాటిపల్లి సుజాత, ఉమాపతి ఇంటికి వచ్చా. సెలవుల్లో రోజూ తాతయ్యతో కలిసి ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్‌ ఫూల్‌ వెళ్తున్నా. ఇంటి వద్ద అమ్మమ్మ మహాభారతం, రామాయణ ఇతిహాసాల ముఖ్య అంశాలు, చిన్న కథలు చెబుతూ నాతో మళ్లీ చెప్పిస్తున్నారు. తీరిక సమయంలో డ్రాయింగ్‌ వేస్తున్నా. తాతయ్యతో కలిసి ఆటలాడుతూ కాలక్షేపం చేస్తున్నా. ఈ వేసవిలో మన సంప్రదాయాలను ఎన్నో నేర్చుకుంటున్నా.

–జనగామ

Advertisement
 
Advertisement
Advertisement