గాడిద–గుర్రం
రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిదమీద పెట్టుకొని తాను గుర్రం ఎక్కి పొరుగూరు వెళ్తున్నాడు. కొంత సేపటికి బరువులు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం అది నాబాధ్యత కాదు బరువులు మోయడానికి నువ్వు..సుఖంగా జీవించడానికి నేను అన్నది. బరువు మోయలేని గాడిద నడుము విరిగి కిందపడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తాను ఎక్కి ప్రయాణం సాగించాడు.ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈగాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది.–ఆత్మకూరు
నీతి : బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.
–కె.వేదశ్రీ,6వ తరగతి, మార్గదర్శి స్కూల్, ఆత్మకూరు


