శరీరదాన అంగీకారం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

శరీరదాన అంగీకారం అభినందనీయం

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 36 మంది తమ కుటుంబ సభ్యుల సహకారంతో శరీరదానం చేస్తామని అంగీకారం తెలుపుతూ హామీ పత్రాలు అందజేశారు. శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్‌ ద్వారా కేఎంసీ ప్రిన్సిపాల్‌ సంధ్య, అనాటమీ హెచ్‌ఓడీ శశికాంతకు ఆ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సంధ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సమక్షంలో తమ మరణాంతరం శరీరదానం చేస్తామని అంగీకార పత్రాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. శరీరదాతల ఆలోచన విధానం ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. శరీర దానం చేయడానికి ముందుకు వచ్చేవారు 8790548706, 9490133650 నంబర్లను సంప్రందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు పద్మ, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పి.వేణు, అనాటమీ సిబ్బంది ప్రేమ్‌కుమార్‌, యాదగిరి పాల్గొన్నారు.

కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య

Advertisement
 
Advertisement
Advertisement