మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా.. లారీల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సకాలంలో లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపకపోవడం వల్ల సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వందల కొద్ది బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటా పెట్టారు. అయితే లారీలు రాక మిల్లులకు తరలించకుండా కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బతిమిలాడితే తప్ప లారీలు వచ్చే పరిస్థితి ఉండటంలేదని సమాచారం.


