కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి.. రూసానోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్‌రెడ్డితో కలిసి శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేయూలోని కెహబ్, హైదరాబాద్‌లోని టిహబ్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) గురించి మంత్రికి వివరించారు. అలాగే, ఈఏడాది జూలైలో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ నిర్వహణ కార్యాచరణను వివరించి ఆహ్వానించారు. ఇందుకు మంత్రి అంగీకారం తెలిపారు. తెలంగాణ యువతలో ఆవిష్కరణ, ఇంక్యూబేషన్, స్టార్టప్ సంస్కృతి, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి కాకతీయ యూనివర్సిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారని వీసీ పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో స్థాయి నగరాల్లో స్టార్టప్ కార్యాకలాపాలకు వరంగల్ కేంద్రంగా ఎదగాలని, కెహబ్ తెలంగాణ ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి ఆకాంక్షించారని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
మంత్రి శ్రీధర్‌బాబును ఆహ్వానించిన వీసీ కె. ప్రతాప్‌రెడ్డి


