బొమ్మలపెండ్లి | - | Sakshi
Sakshi News home page

బొమ్మలపెండ్లి

May 18 2026 6:57 AM | Updated on May 19 2026 1:16 AM

మేము గీసిన చిత్రాలు..

పేరు: ముద్ద నక్షత్ర

పాఠశాల : న్యూఇరా, 6వ తరగతి

గ్రామం: బయ్యారం

చిన్ని చిన్ని బొమ్మలకు పెండ్లండి

మీరంతా రారండి రారండి

కొబ్బరాకు పందిరి వేసినాము

పందిరికి తోరణాలు కట్టినాము

రంగు రంగుల పూలన్నీ మాలకట్టి

పందిరికి ముస్తాబు చేసినాము

అదిగదిగో వచ్చింది బుజ్జిబొమ్మ

పెండ్లి బొట్టు పెట్టుకొని నవ్వింది

పట్టుచీర కట్టుకొని మురిసింది

పూలజడ వేసుకొని మెరిసింది

చిట్టి చిట్టి పీటపై కూర్చుంది

బిడియంతో తలవంచి చూసింది

పట్టుపంచె పెళ్లికొడుకు వచ్చాడు

తాళి కట్టి తలంబ్రాలు పోసినాడు

మేళాలు తాళాలు మోగాయి

పిల్లలంతా చప్పట్లు కొట్టారు

బుజ్జిబుజ్జి బొమ్మల పెండ్లండి

ఎంతెంతో ఘనముగా జరిగింది.

పద్మ త్రిపురారి,

తెలుగు పండిట్‌, జనగామ

(బాలగేయం)

Advertisement
 
Advertisement
Advertisement