ఆడుదాం.. అష్టాచమ్మా | - | Sakshi
Sakshi News home page

ఆడుదాం.. అష్టాచమ్మా

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

చింతగింజలే పాచికలు..

కాజీపేట : గ్రామాల్లో అష్టాచమ్మా ఆట ట్రేడ్‌మార్క్‌ గేమ్‌గా పేరుగాంచింది. ఈ ఆటను వేసవి సెలవుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాలక్షేపం కోసం ఆడుతుంటారు.పల్లెలతోపాటు పట్టణాల్లోనూ చింతగింజలతో ఆడుతూ కనిపిస్తారు. అష్టా చమ్మాను కొన్ని ప్రాంతాల్లో చకార్‌ ఆటగా పిలుస్తారు.

అష్టా చమ్మా ఆడే విధానం..

అష్టా చమ్మా ఆటను భూమిపై లేదా బండలపై చతురస్రాకారంలో 5 గడులు 25 వచ్చేలా గీయాలి. ఈ గీతల కోసం గ్రామాల్లో బొగ్గునే ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ 25 గడుల్లో 9 గడులను సేఫ్టీ రూంలుగా (గదులుగా) భావిస్తూ వాటిలో గుణాకారం వచ్చే విధంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆట ఆడేందుకు విరగ్గొట్టిన నాలుగు చింత గింజలను (పాచికలుగా) ఆడేందుకు ఉపయోగిస్తారు. మొత్తం నలుగురు ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరు తమ ఆట వస్తువులుగా ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న, చిన్న రాళ్లు, చాక్లెట్లు, వేపగింజలు తదితరాలను తీసుకోవచ్చు. చింతగింజలు నలుపు రంగులో పడితే 8 గడులను దాటేందుకు అర్హత పొందినట్టు. అదే తెలుపు ఆకారంలో పడితే 4 గడులను దాటొచ్చు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ముందుకెళ్తారు. ఆడుతు వెళ్తున్న సమయంలో ఎదుటి వారి వస్తువు ఉన్న చోటా మనం ఆగేందుకు అవకాశం ఉంటే వారి వస్తువును తిరిగి వెనక్కి గడియలోకి పంపవచ్చు. ఆటలో గుణాకారపు ఆకారం గడిలో మనకు సంబంధించిన వస్తువులు ఉంటే అది సేఫ్టీ జోన్‌గా భావిస్తారు.

కాపాడే సేఫ్టీ జోన్‌..

అదే బయట ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఉన్నట్టు చింత గింజల ద్వారా వేసే పాచికలు ఎక్కువ విలువ పడే విధంగా వేస్తూ త్వరత్వరగా ఆటలోని గడియ మధ్యలో ఉన్న సేఫ్టీజోన్‌లో చేరితే వారు గెలిచినట్టు లెక్క. ఇలా ఎవరైతే చివరగా సేఫ్టీ జోన్‌లో చేరుతారో వారు ఓడినట్లు ఇలా నలుగురు కూర్చోని ఆడే అష్టా చమ్మా ఆట టైంపాస్‌తోపాటు వినోదాన్ని ఇస్తుంది.

నలుగురు ఆడే ఆట ఇది..

Advertisement
 
Advertisement
Advertisement