ఖిలా వరంగల్: ఓ వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాజీపేటకు చెందిన ఆదిరాల సత్యనారాయణ బైక్‌పై ఈనెల 9న ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు వచ్చి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ఉర్సు గుట్ట జంక్షన్‌కు చేరుకోగానే హనుమకొండ నుంచి ఉర్సుగుట్ట వైపునకు బైక్‌పై వస్తున్న మణికంఠ.. ఆయన బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి కుమారుడు సాయి రాహుల్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


