‘నీట్‌’ రద్దుపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ రద్దుపై ఆందోళన

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

నీట్‌ పరీక్ష రద్దు చేయడం బాధాకరం కష్టపడి చదివితే నిరాశే మిగిలింది మరోసారి పకడ్బందీగా నిర్వహించాలి

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నేషనల్‌ ఎలిజి బులిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)– 2026 రద్దు చేశారు. రాజస్థాన్‌లో పేపర్‌ లీక్‌ అయినట్లు నిర్ధారణ కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంత కష్టపడి చదివి రాశామని, ఇప్పుడు రద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,059మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌: రాజస్థాన్‌లో పేపర్‌ లీకై ందని నిర్ధారణ కావడంతో నీట్‌(యూజీ) పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. నీట్‌ పరీక్ష కోసం లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఎక్కడో పేపర్‌ లీక్‌ అయిందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం నీట్‌ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. ఇలాంటి సంఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

– వంగపండ్ల గౌతమి, జనగామ జిల్లా

కాశిబుగ్గ: ఎంతో కష్టపడి నీట్‌–2026 ఎంట్రన్స్‌ పరీక్ష రాస్తే నిరాశే మిగిలింది. ఇంటర్మీడియట్‌లో అధిక మార్కులు సంపాదించి, నీట్‌ పరీక్ష కోసం సమయాన్ని వృథా చేయకుండా చదివా. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదలకు సేవ చేసే డాక్టర్‌ కోర్సు చదువుకోవాలనేది నా లక్ష్యం. రాజస్థాన్‌ రాష్ట్రంలో పేపర్‌ లీక్‌ చేయడంతో మా ఆశలు నీరుగారాయి. మళ్లీ పరీక్ష రాస్తే గతంలో లాగా రాస్తామో, లేదోనని ఆందోళనతో ఉండాల్సి వస్తుంది.

– జోగు రక్షిత, వరంగల్‌

విద్యారణ్యపురి: నేను ఇంటర్‌ బైపీసీలో 1000 మార్కులకు 984 మార్కులు సాధించా. నీట్‌కు ప్రిపేరై పరీక్ష బాగా రాశా. సీటు వస్తుందనే భావనతో ఉన్నా. అయితే పేపర్‌ లీకై ందని నిర్ధారణ కావడంతో పరీక్ష రద్దు చేశారని తెలిసి బాధగా ఉంది. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్‌ కావాల్సింటుంది. మరోసారి నిర్వహించబోయే నీట్‌ ప్రశ్నపత్రం ఎలా వస్తుందో. ఇప్పటికై నా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి.

– ఎం. రిషిత, పున్నేలు, హనుమకొండ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement