● ముగ్గురికి గాయాలు
హసన్‌పర్తి : బీరుసీసాలు, కత్తితో దాడి చేసిన ఘ టనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో మూడురోజులుగా బీర న్న ఉత్సవాలు సాగుతున్నాయి. ఈక్రమంలో ఆది వారం రాత్రి గ్రామానికి చెందిన రుషికేషన్‌పై అదే ప్రాంతానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ బీరు సీసా, కత్తులతో దాడి చేశాడు. అడ్డు వచ్చిన రుషికేశ్ తండ్రి కుమారస్వామి, మామ భిక్షపతిపై కూడా దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, క్షతగాత్రులను నగరంలో ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కక్షలతో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సైబర్ మోసం..
మహబూబాబాద్ రూరల్ : ఫోన్ పే స్కానర్ పనిచేయడం లేదని ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మా టలు నమ్మిన ఓ గృహిణి.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణికి జరిగిన ఈ మోసం వివరాలను రూరల్ ఎస్సై పి.రాజు ఆదివారం వెల్ల డించారు. మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణికి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. తన బ్యాంకు ఖాతాకు సంబంధించి ఆమె ఫోన్ పే వినియోగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తన ఫోన్ పే స్కానర్ పనిచేయడంలేదని చెప్పడంతో పాటు మరో వ్యక్తి సెల్ నంబర్ చెప్పి ఫోన్ పే ద్వారా రూ.8,860 పంపమని చెప్పగా బాధితురాలు పంపింది. మరోసారి రూ.8,860, రూ.17,720, రూ.8,860 ఇలా మొత్తం నాలుగు దఫాలుగా రూ.44, 300 పంపింది. ఆ తర్వాత కూడా నేరగాళ్లు మరోసారి డబ్బు పంపమని కోరగా బాధితులు ప్రశ్నించింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


