అమ్మచెప్పిన కథ | - | Sakshi
Sakshi News home page

అమ్మచెప్పిన కథ

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

మంచి స్నేహం

జనగామ: ఒక కాల్వ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. ఒక పావురం దాహం తీర్చుకోడానికి కాల్వ దగ్గరకు ప్రతీ రోజు వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్ల సాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాల్వ నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజురోజుకూ కాల్వ నీటిమట్టం పెరిగిపోసాగింది. చీమల పుట్ట నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన పావురం.. చీమలను కాపాడి ఒడ్డుకు చేరుస్తుంది. ఆతర్వాత అక్కడే ఉన్న చెట్టుకు పావురం గూడు కట్టుకోగా, చీమలు మరో పుట్టను ఏర్పాటు చేసుకుని స్నేహాన్ని కొనసాగిస్తాయి.

నీతి: ఒక మంచి స్నేహం చేస్తే కష్టకాలంలో ఎలాంటి సహాయం దొరుకుతుందో ఈకథ ద్వారా తెలుసుకోవచ్చు.

– శ్రీనిత్య, 8వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్మెట

Advertisement
 
Advertisement
Advertisement