బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

రాజవరంలో ఘటన

చిల్పూరు: బైక్‌ అదుపు తప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాజవరంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటేష్‌(45) డీజే సౌండ్‌ నిర్వహిస్తుంటాడు. మంగళవారం మండలంలోని దేశాయితండాలో బొడ్రాయి ఉత్సవాలకు డీజే పెట్టడానికి వెళ్లాడు. అదే రాత్రి 12 గంటలకు పని ముగించుకుని వస్తుండగా ఇంటి సమీపంలోనే బైక్‌ అదుపు తప్పి పక్కన ఉన్న ఖనీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement