కాకతీయుల కళావైభవాన్ని చాటుదాం | - | Sakshi
Sakshi News home page

కాకతీయుల కళావైభవాన్ని చాటుదాం

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

హన్మకొండ కల్చరల్‌: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలో రేచర్ల రుద్రయ్య ప్రాంగణంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో ఓరుగల్లు సాంస్కృతిక మహాసమ్మేళనం, కాకతీయ కళల జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు ఆకుల నాగేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఇంటాక్‌ కన్వీనర్‌ పాండురంగారావు, ఆర్యవైశ్య నాయకులు గట్టుమహేష్‌బాబు, వరంగల్‌ శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. కాకతీయుల కీర్తి, ప్రతిష్టలు పెంచేలా కళావేదిక ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో నాటి వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉండడం మహాద్భుతమని కొనియాడారు. 800 ఏళ్ల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. శిల్ప కళా సంపదను పరిరక్షిస్తూ యునెస్కో గుర్తించేలా అందరం బాధ్యతగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో వివిధ కళల కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరగా మంత్రి అందుకు తగిన విషయాలపై చర్చిస్తానన్నారు. కాళోజీ కళాక్షేత్రం వేదికపై కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా కళాకారులు, కళాజాతర ప్రతినిధులు, వెయ్యికి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క,

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి

కాకతీయ కళల జాతర వేడుకలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement