ఆన్‌లైన్‌ మెడిసిన్‌ విక్రయాలను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మెడిసిన్‌ విక్రయాలను నిలిపివేయాలి

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

20న మెడికల్‌ షాపుల బంద్‌

నెహ్రూసెంటర్‌: ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్న మెడిసిన్‌ విక్రయాలను నిలిపివేయాలని ఈ నెల 20న మెడికల్‌ షాపుల సమ్మె నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పేరాల సంపత్‌రావు తెలిపారు. సమ్మె పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్న నకిలీ, మోసపూరిత మందుల విక్రయాలను అరికట్టాలని డిమా ండ్‌ చేశారు. భారీ డిస్కౌంట్‌ పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ కొన్ని ఆన్‌లైన్‌ సేవలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా మందుల విక్రయం జరగడం ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. సమ్మెలో దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల నిర్వాహకులు పాల్గొంటున్నారని, అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సోమ పురుషోత్తం, బెజగం రాజు, రంగారెడ్డి, రామకృష్ణారావు, మురళి, రవి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement