చిందులేస్తున్న చిన్నిపాదాలు | - | Sakshi
Sakshi News home page

చిందులేస్తున్న చిన్నిపాదాలు

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

హన్మకొండ: వేసవి సెలవుల్లో సెల్‌ఫోన్లు, టీవీలకు మాత్రమే పరిమితం కాకుండా తమలోని అభిరుచికి పదునుపెడుతూ నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. పలువురు విద్యార్థినులు. తమ చిన్ని పాదాలతో చిందులు వేస్తూ నృత్యంలో మెలకులు నేర్చుకుంటున్నారు. హనుమకొండ హౌజింగ్‌ బోర్డు కాలనీలోని సెయింట్‌ పీటర్స్‌ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నృత్య గురువు రుద్రవేణు ఇస్తున్న శిక్షణకు హాజరవుతూ తమలోని టాలెంట్‌కు పదును పెడుతున్నారు ఈ చిన్నారులు. ప్రతీ రోజు ఉదయం.. భరత నాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు నృత్య గురువు రుద్రవేణు.

నృత్యంలో బాలికల శిక్షణ

వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రత్యేక తరగతులు

Advertisement
 
Advertisement
Advertisement