మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి న్యాయం చేయాలని ఎస్‌ఎస్‌యూఐ పట్టణ మాజీ అధ్యక్షుడు బల్లెం చంటి అన్నాడు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి అంకితభావంతో సేవలందిస్తున్న యువ నాయకుడు పెరుమాండ్ల చరణ్‌గౌడ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా చంటి మాట్లాడుతూ.. పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం నిరంతరం పోరాడుతూ విద్యార్థి, యువజన సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారన్నారు. అక్రమ అరెస్టులు చేయడం ద్వారా యువత స్వరాన్ని అణిచివేయాలని ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు.


