ఎస్పీని కలిసిన మాజీ మంత్రి | - | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన మాజీ మంత్రి

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మానుకోట పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్‌ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్పీ శబరీష్‌ హెల్మెట్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమ్నారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ద్విచక్రవాహనదారులతో పాటు వారి కుటుంబానికి కూడా రక్షణ ఇస్తుందన్నారు. అదే విధంగా మాదకద్రవ్యాల (గంజాయి) వాడకం వల్ల కలిగే నష్టాలు, వాటి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, తమ భవిష్యత్‌ను కాపాడుకోనే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement