అనాథలకు అమ్మ | - | Sakshi
Sakshi News home page

అనాథలకు అమ్మ

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

జఫర్‌గఢ్‌: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement