రామవరం అనే చిన్న ఊరిలో నవ్య, కావేరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చదువులో ఇద్దరూ తెలివైన వారే. ఆ ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరికి చదువుంటే చాలా ఇష్టం. నవ్యకు డాక్టర్ కా వా లని కోరిక. కాని ఆత్మవిశ్వాసం తక్కువ. ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే అదే ఆలోచించేది. కా వేరి ధైర్యవంతురాలే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాగా చదువుకుని లాయరై పేదలకు సేవ చేయాలనే కోరిక. ఇద్దరు కలిసి వెళ్తుంటే గ్రామంలో పనిపాటలేని కొందరు మీరు అమ్మాయిలు.. మీకు చదువు ఎందుకు చక్కగా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఊరోళ్లు గొప్ప ఉద్యోగాలు చే యలేరు. మీ నుంచి కాదు అంటూ నిరుత్సాహ పరుస్తారు. నవ్య అదే ఆలోచించుకుంటూ నేను డాక్టర్‌ను కాలేనేమో అనే అనుమానంతో ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడమే మేలేమో అనుకుని నిర్ణయం మార్చుకుంటుంది. సంబంధం రావడంతో పెళ్లి చేసుకుంటుంది. కావేరి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చదువుకుని లాయర్ అవుతుంది. ఎంతో మందికి సేవ చేస్తుంది. చాలా రోజుల తర్వాత నవ్య కావేరిని కలిసి తన కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు వివరిస్తూ నేను ధైర్యంగా చదువుకుని ఉంటే ఈ రోజు డాక్టర్‌ను అయ్యి ఎంతో మందికి సేవ చేసేదాన్ని. నా పిల్లలను కూడా మంచిగా చూసుకునేదానంటూ బాధపడుతుంది. దీనికి కావేరి ధైర్యం చెప్పింది. ఇప్పటికి బాధపడకు. మించిపోయింది ఏమీలేదు. ఏదో ఉద్యోగం సంపాదించు నేను నీకు సాయం చేస్తానంటూ నవ్యకు భరోసా ఇచ్చింది. దీంతో నవ్య ఆగిపోయిన చదువు కొనసాగిస్తుంది. కావేరి సాయంతో నవ్య మంచి ఉద్యోగం సాధిస్తుంది. ఇద్దరు కలిసి పేదలకు సేవ చేస్తూ స్నేహితులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. –లింగాలఘణపురం
నీతి: ఆత్మవిశ్వాసం ఉంటే
సాధించలేనిది ఏదీ లేదు.
– వై.అక్షయ, పదో తరగతి, లింగాలఘణపురం


