రైల్వే స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌ తనిఖీ

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

డోర్నకల్‌: డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్‌ డివిజనల్‌ మేనేజర్‌(ఆపరేషన్స్‌) సంజీవ్‌కుమర్‌ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, గూడ్స్‌ యార్డు, ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, బుకింగ్‌ కౌంటర్‌ను తనిఖీ చేశారు. అనంతరం డోర్నకల్‌, ఖమ్మం మార్గంలో జరుగుతున్న మూడో లైన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్‌ డీఎస్‌ఓ సురేష్‌, డీఆర్‌యూసీసీ సభ్యులు లచ్చిరాంనాయక్‌, ఖాదర్‌, ఆర్‌పీఎఫ్‌ ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రన్నింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి..

డోర్నకల్‌ రైల్వే జంక్షన్‌ పరిధిలోని రన్నింగ్‌ స్టాఫ్‌ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు కోరారు. జంక్షన్‌ పరిధిలో శుక్రవారం పర్యటించిన ఏడీఆర్‌ఎం(ఆపరేషన్స్‌) ఏ.సంజీవ్‌కుమార్‌ను మజ్దూర్‌ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరగా ఏడీఆర్‌ఎం సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియన్‌ బ్రాంచ్‌ సెక్రటరీ అంజయ్య, అసిస్టెంట్‌ సెక్రటరీ కరణ్‌సింగ్‌, వైస్‌ చైర్మన్‌ సుందరయ్య, సుమన్‌, రాములు, కృష్ణ, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పైపులైన్‌కు మరమ్మతు

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీలోని పంపుబావితండా ప్రాంతంలో పగిలిన పైపులైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ‘సాక్షి ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమం ద్వారా తమ దృిష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండేటి రాజకుమారి చర్యలు చేపడుతున్నారు. 6వ వార్డు పరిధిలో పగిలిన పైపులైన్‌కు మున్సిపల్‌ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ శబరీష్‌ పేర్కొన్నారు. ఎస్పీ శబరీష్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు శుక్రవారం విస్తృ త తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలంతో కూడిన జిల్లా డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది సహకారంతో టౌన్‌ పోలీసులు పట్టణంలోని క్రాంతి, నవత, శ్రీరామదాసు మోటారు, వాహనాలు, వస్తువుల రవాణా, అమెజాన్‌, డెలివరీ నౌ, ఫ్లిప్‌కార్ట్‌, ఆర్టీసీ బస్టాండ్‌ పార్సిల్‌ కార్యాలయాల్లో టౌన్‌ ఎస్సై రాంచరణ్‌ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement