కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతీనది ఆది పుష్కరాలకు మించి ఈనెల 21 నుంచి జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో సరస్వతీఘాట్ వద్ద తోరణాలు, డిజైన్స్, నందులు, ఏనుగు, ఇతర బొమ్మలు మర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈనెల 20 వరకు పనులనీ పూర్తి చేసేలాగా అక్కడే తమకు కావాల్సిన డెకరేషన్ తయారు చేసి రంగులు వేస్తున్నారు. అబ్బుర పరిచేలా సెట్టింగ్‌లు చేపడతుండగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అంత్య పుష్కరాలకు భారీగా డెకరేషన్ ఏర్పాట్లు


