లారీలు రావు.. బస్తాలు పోవు | - | Sakshi
Sakshi News home page

లారీలు రావు.. బస్తాలు పోవు

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో

వేలకొద్ది బస్తాల నిల్వ

పడిగాపులు కాస్తున్న రైతులు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వం, మార్క్‌ఫెడ్‌ సంస్థ ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో వేలకొద్ది మక్కల బస్తాలు నిల్వ ఉన్నాయి. ఇటీవల 20వేల బస్తాలపైగా మక్కలు కొనుగోలు చేయగా.. సకాలంలో లారీలు రాకపోవడంతో బస్తాలు మిల్లులకు తరలించలేదు. దీంతో భారీగా పేరుకుపోయా యి. వీలున్నప్పుడు ఒక లారీ మాత్రమే వస్తుండడంతో అందులో 550 నుంచి 600 బస్తాలు మాత్రమే తరలిస్తున్నారు.

మరో 10వేల బస్తాలు..

ఇప్పటి వరకు 20వేల బస్తాలు కొనుగోలు చేసి అక్కడే నిల్వ ఉండగా.. మరో 10వేల బస్తాలు నింపి ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మక్కలు తడిసిపోగా రైతులు వాటిని ఆరబెట్టుకొని బస్తాల్లో నింపి ఉంచారు. వేల కొద్ది బస్తాలు నిల్వ ఉండడంతో మహబూబాబాద్‌ మండలంతో పాటుగా చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు మక్కలను విక్రయించేందుకు వచ్చి నెలల తరబడి వ్యవసాయ మార్కెట్‌లోనే పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

లారీలు రావడం లేదు..

మానుకోటలోని మక్కల కొనుగోలు కేంద్రానికి 83 బస్తాల మక్కలను 20 రోజుల క్రితం విక్రయించేందుకు తీసుకువచ్చా ను. ఇటీవల పీఏసీఎస్‌ సిబ్బంది బస్తాలు నింపి కాంటాలు పెట్టారు. లారీలు రావడంలేదని చెబుతున్నారు. ఇన్ని రోజులుగా ఇంటి నుంచి వచ్చి వెళ్తున్న క్రమంలో రూ.2వేల వరకు పెట్రోల్‌కు ఖర్చు అయ్యింది. వర్షం వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బందిపడ్డారు.

–పి.యాకయ్య, రైతు, మాధవాపురం

Advertisement
 
Advertisement
Advertisement