నా పేరు బొగ్గారపు సహర్షిత్. నేను పాలకుర్తిలో ఉంటా. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల నేపథ్యంలో పిచ్చుకలు దాహార్తి తీర్చుకోవడానికి వృథా ప్లాస్టిక్ బాటిల్‌ను నీటి తొట్టిగా మార్చి ప్రతీ రోజు నీరు పోస్తున్నా. పిచ్చుకలు వచ్చి నీరు తాగుతుంటే మా నాన్న నాగరాజు, అమ్మ దివ్య జ్యోతి నన్ను అభినందిస్తున్నారు. దీంతో నాకు చాలా ఆనందం కలుగుతోంది. అలాగే, ఖాళీ సమయంలో పర్యావరణ ప్రకృతిని చిత్రాలు గీస్తూ మా చెల్లి శ్రీహర్షిణితో కూడా గీయిస్తున్నా. చెస్, క్యారం ఆటలు నేర్పిస్తున్నా. ఇంట్లో అమ్మ చెప్పే కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నా.
–జనగామ


