పేకాట రాయుళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్ల అరెస్ట్‌

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

రూ.1,32,090 నగదు స్వాధీనం

హసన్‌పర్తి: భీమారంలోని ఓ పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సోమవారం రాత్రి దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో రూ.1,32,090 నగ దు స్వాధీనం చేసుకోవడంతోపాటు 9 ఫోన్లు సీజ్‌ చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేసింది. భీమారంలోని గణేశ్‌ నగర్‌లో కొంతకాలంగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు నిర్వహించింది. ఇందులో పేకాట ఆడుతున్న దేశిని వీరస్వామి, లవన్‌కుమార్‌, శరత్‌కుమార్‌, దామెర నాగరాజు, సూరం మల్లికార్జున్‌, సుధాకర్‌, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌ బాబులాల్‌, ఎస్సై సుధాకర్‌, సిబ్బంది గౌస్‌ పాషా, శ్యాంకుమార్‌, కేయూ ఎస్సై కల్యాణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌

యువకుడి దుర్మరణం

నెల్లికుదురు: మక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను బైక్‌ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు శివారులో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్‌ బాబు కథనం ప్రకారం.. బిహార్‌లోని రాయిగుడాకు చెందిన సంతోష్‌ కుమార్‌ కొంతకాలంగా నెల్లికుదురు మండలం నైనాలలో నివాసముంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెల్లికుదురు శివారులోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి మక్కజొన్న లోడ్‌తో మహబూబాబాద్‌ వైపునకు అజాగ్రత్తగా ఎలాంటి ఇండికేషన్‌ వేయకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్‌ టౌన్‌ సాయిబాబ గుడి బజార్‌కు చెందిన ముద్రగణం విశాల్‌ కుమార్‌ (38) బైక్‌పై తొర్రూరు వైపు నుంచి వస్తూ వెనుక నుంచి ట్రాక్టర్‌ ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు 108లో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య శశాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ బాబు సోమవారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement