విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

డీఈఓ సత్యనారాయణమూర్తి

తొర్రూరు: విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్‌, క్రాఫ్ట్‌–కల్చరల్‌ డే’ కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం జెల్ల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యతో పాటు ఇతర అంశాలపై పట్టు సాధించాలన్నారు. సంస్కృతి, కళలపై ఆసక్తి అవసరమన్నారు. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ లెర్నింగ్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీరాములు, ఏఎస్‌సీ సంతోష్‌, ఎంఈఓ బుచ్చయ్య, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్‌రెడ్డి, హెచ్‌ఎంలు వెంకటేశ్వర్లు, శ్రీనుబాబు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement