నెల్లికుదురు: ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జినుగు మరియన్న సూచించారు. శనివారం మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు పి.సరస్వతి మల్బరీ పంట క్షేత్రపర్యటన చేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు, ప్రభుత్వం సబ్సిడీ అందించే పంటలు ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించామని, ఎరువులు, పురుగు మందులు అవసరం లేని మల్బరీ సాగుతో ఎకరానికి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. క సెరీకల్చర్ అధికారి రాజయ్య, రైతు జనార్దన్ పాల్గొన్నారు.


