ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: వరంగల్‌ జిల్లా చదరంగం సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి అండర్‌– 11 చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో అద్విత్‌ అనిశెట్టి, శ్రేయాన్‌ రామ్‌ శివరాత్రి, జక్కం గౌరిక్‌సాయి, రేయాన్స్‌రాయ్‌, బాలికల విభాగంలో సాన్విక పెన్డ్రు, ఆద్య అనిశెట్టి, బెగావత్‌ రీతిక, ధరావత్‌ ఆరుషి విజేతలుగా నిలిచారు. మాస్టర్‌జీ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఏఓ నాగరాజు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులు చదరంగంలో జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూన్‌ 19, 20, 21న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బిటర్స్‌ ప్రేమ్‌సాగర్‌, రజనీకాంత్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement