● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో నూతనంగా రాజ్యసభకు ఎన్నికై న వేం నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎవరికీ ఇళ్లు ఇవ్వలేదని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, స్థానికంగా రైల్వే పీఓహెచ్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. రానున్న రెండున్నర ఏళ్లలో మిగిలిన హామీలను కూడా అమలుచేసే విధంగా చూస్తున్నామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధాబాయి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్లు జ్యోతి, సునీత, ప్రగతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


