గ్రంఽథాలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రంఽథాలయాల అభివృద్ధికి కృషి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

గ్రంఽథాలయాల అభివృద్ధికి కృషి

మహబూబాబాద్‌: గ్రంథాలయాలు విజ్ఞాన గని అని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని , గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా గ్రంథాలయం సంస్థ ఎదుట బుధవారం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ రియాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలలో ఉన్న పుస్తకాలను చదవి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మానుకోట జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. విద్యపై ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ పెట్టాలన్నారు. ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వెన్నం శ్రీకాంత్‌రెడ్డి చైర్మన్‌ పదవి ఇచ్చి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు. అనంతరం చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉమా, నునావత్‌రాధా, జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, జాన్సీరాణి, బి.అజయ్‌సారథిరెడ్డి, విజయ్‌సారథిరెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పని చేయాలి

కొత్తగూడ: గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. మండలకేంద్రంలోని రైతువేదికలో కొత్తగూడ, గంగారం మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులను పెంచాలని సూచించారు. కూలీల పనిదినాల ఆధారంగానే గ్రామాల్లో సీసీ రోడ్లు వస్తాయని అన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ చల్ల నారాయణరెడ్డి, తహసీల్దార్‌ రాజు, ఎంపీడీఓ మున్వర్‌ పాల్గొన్నారు.

మంత్రి ధనసరి సీతక్క

Advertisement
 
Advertisement
Advertisement