మరిపెడ రూరల్: పరమశివుని ఆశీస్సుల ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. బుధవారం మండంలోని ఎల్లంపేటలో నూతనంగా నిర్మించిన శివాలయం, బొడ్రాయిని ఇటీవల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శివాలయంలోని ఉమామహేశ్వర స్వామి, గ్రామ దేవాల బొడ్రాయి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గండి వీరభద్రం, బుచ్చిబాబు, వీరన్న, జర్పుల విజయ్‌కుమార్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
చిన్నగూడూరు: మండల కేంద్రం శివారు ఆకేరువాగు పక్కన నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురోహితులు వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిపించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో కలిసి మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రాసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బత్తెం రమేష్, ఉపసర్పంచ్ గాడిపెల్లి జీవన్, విగ్రహదాతలు గాడిపెల్లి జగన్, గాడిపెల్లి భరత్, నాయకులు గునిగంటి కమలాకర్, పిల్లి వీరన్న, ఆలయ, యాదవ సంఘం కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.


