కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన టీజీఎడ్‌సెట్ –2026 ప్రశాతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంలో ఏడు, వరంగల్‌జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు ముందుగానే చేరుకున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 2,304మంది హాజరుకావాల్సి ఉండగా 1,886 మంది (81.86శాతం) హాజరయ్యారు. 418మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగగా 2,304 మందికి 1,926 మంది అభ్యర్థులు (83.59శాతం) హాజరయ్యారు. 378 మంది గైర్హాజరయ్యారని టీజీఎడ్‌సెట్ కన్వీన ర్ ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. కాగా, హనుమకొండలో పలు కేంద్రాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతకుముందు టీజీఎడ్‌సెట్ ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి.. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డితోకలిసి ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, సెక్రటరీ పొఫెసర్ శ్రీరామ్‌వెంకటేష్, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, టీజీఎడ్‌సెట్ కన్వీనర్ బి.వెంకట్రామ్‌రెడ్డి, వివిధ విభాగాల డీన్లు రాంనాథ్ కిషన్, బి. సురేశ్‌లాల్, కె. రాజేందర్,జి. హనుమంతు, విద్యాకళా శాల ప్రిన్సిపాల్ నల్లానిశ్రీనివాస్ పాల్గొన్నారు.
మొదటి సెషన్‌కు 81.86 శాతం, రెండో సెషన్ 83.59 శాతం మంది హాజరు
పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, వీసీ


