టీజీ ఎప్‌సెట్‌లో ‘ఎస్‌ఆర్‌’ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

టీజీ ఎప్‌సెట్‌లో ‘ఎస్‌ఆర్‌’ విద్యార్థుల ప్రతిభ

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

విద్యారణ్యపురి: టీజీ ఎప్‌సెట్‌–2026 ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. టీజీ ఎప్‌సెట్‌ బైపీసీ విభాగం రాష్ట్రస్థాయిలో వి.సాహ్యు 14వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా కె.జీవన్‌ కుమార్‌ 91వ ర్యాంకు, కె.ఆశ్రిత 262వ ర్యాంకు, ఆర్‌.శ్రావణి 298వ ర్యాంకు సాధించారని వివరించారు. ఎంపీసీ విభాగంలో జి.యువన్‌చంద్ర 299వ సాధించారని వారు తెలిపారు. అలాగే, టీజీఎప్‌సెట్‌లో జె.శ్వేత 351వ ర్యాంకు, జె.గురుమోహన్‌చరణ్‌ 369వ ర్యాంకు, ఎన్‌.అవినాష్‌ 408వ ర్యాంకు, ఎన్‌.శివకల్యాణి 413వ ర్యాంకు, పి.సంజన 414వ ర్యాంకు, వై.సాత్విక్‌ 476వ ర్యాంకు, ఆర్‌.నిరూప్‌రెడ్డి 515వ ర్యాంకు, కె.జాహ్నవి 610వ ర్యాంకు, సి.హెచ్‌ అర్నవ్‌ 628వ ర్యాంకు, కె.ధీరజ్‌ 654వ ర్యాంకు సాధించారని వివరించారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో పటిష్టమైన ప్రణాళికతో హైస్కూల్‌, జూనియర్‌ కాలేజీ, ఎంసెట్‌, ఐఐటీల్లో విద్యనందిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈఏడాది జేఈఈ మెయిన్‌–2026లో ఉత్తమ ఫలితాలు సాధించారని వారు తెలిపారు.

‘రెజోనెన్స్‌’ విద్యార్థుల సత్తా..

హన్మకొండ: టీజీఎప్‌సెట్‌లో వరంగల్‌లోని రెజోనెన్స్‌ విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ టీజీ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసింది. ఇందులో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని రెజోనెన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. డి.స్నితిక 753వ ర్యాంకు, సి.హెచ్‌.భువనేశ్వరి 878, డి.సంజన 925, ఎ.రితిక 982వ ర్యాంకు సాధించిందని వివరించారు. వీరు రాష్ట్రంలోని ఉన్నత శ్రేణి కళాశాలల్లో ప్రవేశాలు పొందబోతున్నారన్నారు. వీరితో పాటు 291 మంది విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్‌ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, డీన్‌ బి.ఎస్‌.గోపాల్‌ రావు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం

హసన్‌పర్తి: టీజీఎప్‌సెట్‌–2026 ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెదిన బి. స్వామి (150 ర్యాంకు), ఎన్‌.చరణ్య(2,426 ర్యాంక్‌),కె.సౌందర్య(3,649 ర్యాంకు),ఎ.నవ్య(4,435 ర్యాంక్‌),ఎ. రత్యా(4,838 ర్యాంకు), జి. పూజిత(5744ర్యాంక్‌),పి. యశస్విని(6475 ర్యాంక్‌),ఇ. శ్రీశాంతి వర్మ(6863 ర్యాంక్‌),ఎం. ఐశ్వర్య (7,166 ర్యాంకు),ఇ. క్రిష్ణజా(7,840 ర్యాంకు),బి.అంజన శ్రీ (8,548 ర్యాంకు),ఎన్‌.జశ్వంత్‌ (9,018 ర్యాంకు),డి.సాయి కార్తీకేయ(9,114 ర్యాంకు), సి.హెచ్‌. అన్వేష్‌ (1,0318 ర్యాంకు),పి. సహస్ర శ్రీ(1,0997 ర్యాంకు) సాఽధించినట్లు శివాని కళాశాల కరస్పాండెంట్‌ తాళ్లపల్లి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌ తాళ్లపల్లి స్వామి, కళాశాల ప్రిన్సిపాళ్లు జి. సురేందర్‌రెడ్డి ,వి. చంద్రమోహన్‌, డైరెక్టర్లు టి.రాజు, ఎన్‌. రమేష్‌, ఎ. మురళీధర్‌, వి. సురేశ్‌, ఎస్‌.సంతోష్‌రెడ్డి అభినందించారు.

‘ఇన్‌స్పైర్‌’ విద్యార్థుల ప్రభంజనం

హసన్‌పర్తి : టీజీఎప్‌సెట్‌ ఫలితాల్లో హనుమకొండజిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట క్రాస్‌లోని ఇన్‌స్పైర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృషించారు. కళాశాలకు చెందిన పి. యోగి రాజ్‌ (1,190 ర్యాంకు), పి.సాయిప్రియ (6,994ర్యాంకు),ఎస్‌.అర్చన(8,389ర్యాంకు),టి. సాయి శ్రేష్టిత(9,614ర్యాంకు)సాధించినట్లు కళాశాల చైర్మన్‌ తీగల భరత్‌గౌడ్‌ తెలిపారు. ఈసందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్‌ తీగల భరత్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ సుంకరి శ్రీరాంరెడ్డి, డైరెక్టర్లు తీగల రాజ్‌కుమార్‌, కోటిచింతల మమతకుమారి, లాడే శివ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement