విద్యుత్‌ సేవలు మరింత సులభం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సేవలు మరింత సులభం

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

హన్మకొండ: విద్యుత్‌ వినియోగదారులకు అరచేతిలో సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు సలహాలు, సూచనలు పొందే అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అనుసంధానంతో అధునాతనంగా వాట్సాప్‌ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 18 సర్కిళ్లలో 70.39 లక్షలు మంది విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ యాజమాన్యం ముందుకుపోతోంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందిస్తూ వినియోగదారులకు సులభతరం చేసింది. ఈ క్రమంలో ఈనెల 8 నుంచి ఏఐ వాట్సాప్‌ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాట్సాప్‌లో వినియోగదారులు సమస్యను తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లోనూ మెసేజ్‌ చేసి పోస్టు చేయాలి. ఏఐ పోస్టు (ప్రశ్న)ను అర్థం చేసుకొని, విశ్లేషించుకొని వినియోగదారుడికి అవసరమైన సమాచారం అందిస్తుంది.

వినియోగదారులు వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా ఈ కింది సేవలు పొందవచ్చు..

బిల్లు విచారణ : ప్రస్తుత బిల్లు మొత్తం చెల్లింపు తేదీ.

చెల్లింపు స్థితి : వినియోగదారులు చెల్లించిన బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు.

ఫిర్యాదు నమోదు: తెలుగు, ఇంగ్లిష్‌లో వివరాలు తీసుకుంటుంది. వినియోగదారుడికి ఫిర్యాదు టికెట్‌ ఇస్తుంది.

● ిఫర్యాదు టికెట్‌: టికెట్‌ నంబర్‌తో ఏ ఫిర్యాదు స్థితినైనా తెలుసుకోవచ్చు.

అంతరాయ సమాచారం: వినియోగదారులు సేవా ప్రాంతంలో ప్రస్తుత అంతరాయ స్థితిగతులను తెలుసుకోవచ్బు.

టీజీఎన్పీడీసీఎల్‌ హెల్ప్‌ లైన్‌: చాట్‌బాట్‌కు స మాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు వినియోగదారుడితో ఉద్యోగి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతారు.

● వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలు వినియోగదారులకు 24/7 అందుబాటులో ఉంటాయి. రైతులకు అర్థమయ్యే విధంగా తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యుత్‌ బిల్లుల పూర్తి సమాచారం, బిల్లుల విచారణ, చెల్లింపుల స్థితి సెకన్లలో పరిష్కరిస్తారు. కాల్‌ వెయిటింగ్‌ టైం, ఏజెంట్‌ క్యూ ఉండదు. మెనూ నావిగేషన్‌ మాత్రం ఉంటుంది.

● వినియోగదారుడు తమ మొబైల్‌లో 8712481489 ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లి కావా ల్సిన సేవలను సులభంగా పొందవచ్చు. ఈ సేవలను నేరుగా యాక్సెస్‌ చేయడానికి హెచ్‌టీటీపీఎస్‌://డబ్ల్యూఏ.ఎంఇ/918712481489 ( https://wa.me/918712481489) లింక్‌పై క్లిక్‌ చేయాలి. సేవలు పొందే సులభమైన అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం కల్పించింది.

వినియోగదారులకు ఏఐ

అనుసంధానంతో వాట్సాప్‌ చాట్‌బాట్‌ సర్వీస్‌

టీజీ ఎన్పీడీసీఎల్‌లో అందుబాటులోకి అధునాతన సాంకేతిక సేవలు

Advertisement
 
Advertisement
Advertisement